భక్తులకు భారీ షాక్.. వినాయక నిమజ్జనం నిషేధం..?

praveen
సాధారణంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాలలో అయితే వినాయక చవితి ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద విగ్రహాలను ప్రతిష్టించడం లో పోటీ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఈ మధ్య కాలంలో వివిధ రసాయనాలతో తయారుచేసిన వినాయక విగ్రహాల ద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే పర్యావరణాన్ని పరిరక్షించాలనే  ఉద్దేశంతో గతంలో మట్టి వినాయకులను విక్రయించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు అధికారులు కూడా ఎన్నో చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే ఎంతో మంది  పర్యావరణం పరిరక్షణ కోసం కేవలం మట్టి వినాయకులను మాత్రమే ప్రతిష్టించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అన్న విషయం తెలిసిందే కానీ కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా ఇప్పటికి కూడా రసాయనాలతో తయారుచేసిన వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు తద్వారా వినాయక విగ్రహాలను నదులు-చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా ప్రస్తుతం పర్యావరణం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది.



 ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రం లోని నదులు చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేయడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి. పూజ వస్తువులను కూడా నదులు-చెరువుల్లో పడేయడానికి వీలు లేదు అంటూ తెలిపింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు గంగా నది శుద్ధి జాతీయ కమిషన్ సూచనల మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇక ఈ చర్యలు చేపట్టడం వల్ల నీటి కాలుష్యం భారీగా తగ్గుతుంది అంటూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: