మద్యం మత్తులో వచ్చిన మరిది.. అలా చేయడంతో వదిన ప్రాణం పోయింది..?
మద్యం మత్తులో మరిది ఏకంగా వదిన ను దారుణంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చి స్థానికంగా కలకలం సృష్టించింది ఈ ఘటన. ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మద్యం మత్తులో వచ్చిన మరిది ఈ ఘాతుకానికి తెగబడ్డారు. ఇనుప రాడ్ తో వదిన పై దాడి చేయడంతో చివరికి మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వివరాల్లోకి వెళితే సత్తెనపల్లి మండలం పాకాల పాడు గ్రామం లో... రాణి అనే 35 ఏళ్ల మహిళ నివసిస్తుంది. ఒక ఇటీవలె మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మరిది తో రాణి గొడవ పడింది.
అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తికి రాణి కి మధ్య గొడవ జరిగి మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడిగా మారిపోయిన సదరు వ్యక్తి పక్కనే ఉన్న ఐరన్ రాడ్ తో వదిన పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలోనే తీవ్రగాయాల పాలైన రాణి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఇక స్థానికుల పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.