రికార్డు స్థాయిలో డిగ్రీ అడ్మిషన్లు.. ఎక్కువ ఏ గ్రూప్ తీసుకున్నారో తెలుసా..?
కాగా ఇటీవల తెలంగాణ విద్యాశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2019 సంవత్సరంతో పోలిస్తే కరోనా వైరస్ సంక్షోభం సమయంలోనే విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పెరిగింది అని తెలిపింది. 2019 తో పోలిస్తే ఈ ఏడాది డిగ్రీ కోర్సులో చేరిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది కేవలం 1,87,774 మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్నారని కానీ ఈ సారి మాత్రం 2,12,429 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలంగాణ విద్యా శాఖ తెలిపింది. కరోనా సంక్షోభం సమయంలో కూడా అడ్మిషన్ల ప్రక్రియ ఎక్కడా తగ్గలేదు అంటూ తెలిపింది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1059 కాలేజీలలో నాలుగు లక్షల 24 వేల 315 సీట్లు ఉండగా దోస్త్ వెబ్ సైట్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ లో భాగంగా రెండు లక్షల 12429 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు తీసుకోవడం గమనార్హం. అయితే ఈ ఏడాది డిగ్రీ కోర్సులో చేరిన ఎక్కువ మంది విద్యార్థులు బీకామ్ గ్రూప్ తీసుకున్నారు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. దాదాపు 85వేల 691 మంది విద్యార్థులు బీకామ్ గ్రూప్ తీసుకున్నారని.. ఇప్పుడు వరకు ఇదే ఎక్కువ అంటూ విద్యాశాఖ తెలిపింది. ఇలా కరోనా వైరస్ సంక్షోభం సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు నమోదు కావడం గమనార్హం.