చైనా కు ఊహించని షాక్ ఇచ్చిన చిన్ని దేశం.. డ్రాగన్ పరిస్థితి ఏంటో..?

praveen
చైనా దేశం అనేది ఈ మధ్య కాలంలో చౌకధరల దుకాణం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  ప్రపంచ దేశాలలో ఎంతో ఎక్కువ ధరకు దొరికే వస్తువులు అన్నీ కూడాచైనాలో మాత్రం అతి తక్కువ ధరకే లభిస్తుంటాయి. అలా అని చైనా వస్తువులు కొనుగోలు చేశారు అంటే ఇక మన గొయ్యి  మనం తవ్వుకున్నట్లే ఉంటుంది పరిస్థితి సరిగా పనిచేయక చివరికి అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా చైనా కు సంబంధించిన ఎలక్ట్రికల్ వస్తువుల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే కరోనా  విషయంలో కూడా ఇదే తీరు అవలంబించింది అన్న విషయం తెలిసిందే.

 కరోనా  సంక్షోభం సమయంలో చైనా పంపించిన మాస్కులు పూర్తిగా క్వాలిటీ లేకుండా ఉన్నాయి అనే కారణంతో ప్రపంచ దేశాలు పూర్తిగా నిషేధించాయి. ఇక చైనా అందించిన శానిటైజర్ లపై  కూడా  ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అదే సమయంలో చైనాతయారు చేసిన టెస్టింగ్ కిట్లపై కూడా ప్రపంచ దేశాలు పూర్తిస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసి దిగుమతులను నిలిపివేశారు అనే విషయం తెలిసిందే.  ఇక ఇప్పటికే చైనా ఇలా తయారు చేసిన అన్ని వస్తువులను కూడా ప్రపంచ దేశాలు తిప్పి పంపగా ఇక ఇప్పుడు వ్యాక్సిన్  వంతు వచ్చింది.

 ప్రపంచ దేశాలలో కరోనా  వైరస్ వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంటే  కేవలం చైనాలో మాత్రం కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే కొన్ని దేశాలు వ్యాక్సిన్ కొనుగోలు చేశాయి కూడా. కానీ వ్యాక్సిన్  లో ఎలాంటి క్వాలిటీ లేకపోవడం.. ఒక పనికిరాని మందుగా తేలడంతో ప్రపంచ దేశాలు క్రమక్రమంగా చైనా వ్యాక్సిన్ను నిషేధిస్తూ వచ్చాయి. ఇటీవలే  అతి చిన్న దేశం అయిన పెరూ  చైనా వాక్సిన్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. చైనా వ్యాక్సిన్  పెరూ దేశంలో ఉపయోగిస్తే పెద్ద ఎత్తున సైడ్ఎఫెక్ట్స్ రావడంతో వెంటనే నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: