తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

P.Nishanth Kumar
తెలంగాణ లో బీజేపీ ప్రభంజనం అందరు గమనిస్తూనే ఉన్నారు.  పార్లమెంట్ ఎన్నికలతో మొదలైన వారి ప్రభంజనం నిన్నటి గ్రేటర్ ఎన్నికల వరకు కొనసాగుతూ వచ్చింది. క్రమక్రమంగా వారి బలం రాష్ట్రంలో పుంజుకుంటూ వచ్చి గెలిచేంతవరకు వచ్చింది.. దుబ్బాక లో గెలిచిన విజయోత్సాహం గ్రేటర్ లో కనపరిచి మంచి ఫలితాలు సాధించారు. అక్కడ కేసీఆర్ లాంటి నాయకుడిని బీజేపీ కంగు తినిపించింది అంటే పార్టీ లో నాయకత్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక బీజేపీ గురి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై పడింది.

అక్కడ త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలో గెలిచి ఇక్కడ కూడా సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ కొంతవరకు బలోపేతం చేశాడు. అవసరం ఉన్నా లేకున్నా ఇతర పార్టీ  ల నేతలని విరుచుకుపడుతూ గతంలోకన్నా ఇప్పుడు పార్టీ బలం పొందేలా చేశారు.. ఇక పార్టీ తిరుపతిలో  అపుడే పట్టు పెంచుతోంది. అక్కడ గెలవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రంగంలోకి దిగేందుకుసిద్ధంగా ఉంది.. ఇక టీడీపీ అయితే ఇప్పటికే ఇక్కడ పార్టీ అభ్యర్థి ని ప్రకటించి పోటీ లో తామే ముందు అన్నట్లు ప్రకటించింది.

వైసీపీ పార్టీ కూడా ఇక్కడ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. మొన్నటికి మొన్న వైఎస్సార్‌ సీపీ అధికారంలో లేకపోయినప్పటికీ ఆ పార్టీ ఎంపీ అభ్యర్ది బల్లి దుర్గా ప్రసాదరావు దాదాపు 2 లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క తిరుపతి అసెంబ్లీ స్థానం తప్పితే మిగిలిన అన్ని చోట్లా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీలనే పొందారు. ఇప్పుడు ఆ పార్టీయే అధికారంలో ఉంది. అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోంది. దీంతో ఇక్కడ గెలుపుపై వైఎస్సార్‌సీపీ భారీ ధీమాతోనే వ్యవహరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: