వారం రోజుల్లో పెళ్లి.. కానీ అంతలోనే భర్త కళ్ళెదుటే భార్య..?
వివరాల్లోకి వెళితే.. రాజాం పట్టణంలోని మారుతీ నగర్ లో ప్రదీప్ కుటుంబం ఉంటుంది సరోజిని పీహెచ్సీలో పని చేస్తుండగా ఆమె భర్త ప్రదీప్ హౌస్ ఏఈ గా విధులు నిర్వహిస్తున్నారు. మరో వారం రోజుల్లో వీరి కూతురు వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఇక బంధు మిత్రులు అందరికీ శుభ లేఖలు పంచడానికి తల్లిదండ్రులు వెళ్లారు. ఈ క్రమంలోనే వారి ఆనందాన్ని చూసి ఓర్వలేక పోయింది విధి. చివరికి రోడ్డు ప్రమాదం రూపంలో కబళించి ప్రాణాలు తీసేసింది. ద్విచక్ర వాహనంపై ప్రదీప్ సరోజినీ వెళ్తున్న సమయంలో... గొల్ల సీతారాంపురం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో వీరి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ క్రమంలోనే ఈ ప్రమాదంలో సరోజినీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది ఇక భర్త ప్రదీప్ కి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు సరోజినీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ఆస్పత్రికి తరలించగా.. ప్రదీప్ పరిస్థితి కూడా విషమంగా ఉంది ఈ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు