చంద్రబాబుకి రాజకీయ రిటైర్మెంట్..
70 ఏళ్ల వయసున్న చంద్రబాబు కరోనా టైమ్ లో బయటకు రావడానికే ఇబ్బంది పడుతున్నారని, ఆయన రాజకీయ రిటైర్మెంట్ కు టైమ్ దగ్గర పడిందని అన్నారు. ఇప్పుడే బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న బాబు, 2024 ఎన్నికల నాటికి రాజకీయాల్లో ఎలా ఉండగలరని ప్రశ్నించారు.
ప్రజల మీద నమ్మకం ఉన్న నాయకుడు ప్రజల్లో ఉంటాడు తప్ప ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చోరన్నారు మంత్రి నాని. చంద్రబాబులాగా 600 హామీలు ఇచ్చి ఆరు కూడా నెరవేర్చకుండా ఐదేళ్లు కాలం గడిపిన పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 90 శాతం ఎన్నికల హామీలను 18 నెలల్లో నెరవేర్చిన సీఎం జగన్ ని ప్రజలు ఎందుకు వదులుకుంటారనే ఆలోచన చంద్రబాబుకు లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు నాని.
సీఎం జగన్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి రూ.77 వేల కోట్లకుపైగా ఖర్చు చేసిందన్నారు మంత్రి నాని. లోకేశ్ మీద నమ్మకం లేక చంద్రబాబు పార్టీ బాధ్యతలు అప్పజెప్పకుండా జూమ్ నాయుడుగా కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిస్తే అది బాబు కళ్లకు కనబడలేదన్నారు. పోలీసులు, వైఎస్సార్సీపీ నేతలపై కేసులు వేయండని టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని, ఆయన అనుభవం అందుకు పనికొస్తుందని మంత్రి విమర్శించారు. చంద్రబాబు రాజకీయ రిటైర్మెంట్ కి టైమ్ దగ్గరపడిందని, అందుకే ఆయన ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.