టీకా వచ్చిందని రిలాక్స్ అవ్వకండి..మరో ప్రమాదం కూడా ఉంది..

Satvika
ఇటీవల ప్రపంచాన్ని వణికించిన కరోనా వల్ల ప్రజలు ఇప్పటికీ కుదురుగా ఉండకేకున్నారు. ఒక వైపు ప్రభుత్వం పెట్టిన నిబంధనలను అనుసరించిన కూడా కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ ప్రజలను భయంలో పడేసింది. ఎందరో ఇప్పటికీ ఆస్పత్రిలో కరోనాతో పోరాడుతున్నారు. అయితే ఈ మధ్య కరోనా కు టీకా వచ్చిందని ప్రభుత్వం చెప్తున్నారు. కానీ వాటి మీద ప్రజలకు మాత్రం నమ్మకం లేదని తెలుస్తుంది. పెద్ద పెద్ద రోగాలకు మందులు ఉన్నా కూడా మరణాలు తప్పలేదు. ఇప్పుడు కరోనా పై కూడా అందరూ అనుకుంటున్నారు.. వ్యాక్సిన్ వచ్చిన కూడా మాస్కులు వాడాలని నిపుణులు చెబుతున్నారు..

మార్చిలో ఉగ్ర రూపాన్ని దాల్చిన కరోనా మహామ్మరి వైరస్ అందరినీ టెన్షన్ కు గురిచేసింది. దాదాపు ఎనిమిది నెలలు నుంచి ప్రభుత్వం మరియు ప్రజలు కష్టానికి ఫలితం దక్కింది..దాదాపు చివరి ట్రైల్ కూడా చేశారు. ఇక కొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది.కరోనా టీకా తీసుకుంటే ప్రమాదం పూర్తిగా తొలగిపోయినట్టేనని, ఇకపై మాస్కు ధరించాల్సిన పనుండదనేది చాలామంది భావన. ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలేవీ పాటించాల్సిన అవసరం లేదని అనుకునేవారూ ఎందరో. కానీ ఆ ఆశలు కొద్ది రోజులు పక్కన పెట్టాల్సిందే.. ముందులాగా జాగ్రత్తలు పాటించకపోతే మరణం తధ్యం అంటున్నారు..

అప్పుడే మరీ అంత ధీమా పనికిరాదు. కరోనా టీకా తీసుకున్నా కొంతకాలం వరకు మాస్కు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు వెల్లడించారు. ఎందుకు టీకా తీసుకున్నాము కదా అనే ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. కానీ, మోడెర్నా రూపొందించిన టీకా విషయంలోనైతే 4 వారాల అనంతరం రెండో మోతాదు అవసరమవుతుంది. మొదటి టీకా తీసుకున్నాక ఎంతో కొంత రక్షణ లభించటం నిజమే కావొచ్చు గానీ రెండో మోతాదు తీసుకున్నాకే పూర్తి భరోసాతో ఉండొచ్చు..ఈ టీకాలు కొంతవరకు మేలు చేస్తాయి అంతే. అందరికీ టీకాలు వేయాలంటే ప్రభుత్వానికి తడిసి మోపడవుతుంది.. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని నిపుణులు అంటున్నారు... లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: