శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆ నకిలీ వెబ్ సైట్ తో మోసపోకండి.. టీటీడీ హెచ్చరికలు..?

praveen
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల బెడతా రోజురోజుకు ఎక్కువవుతోంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆన్లైన్ లో ఏం చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో. ఇక అడుగడుగునా ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా అని వేచి చూస్తున్న సైబర్ నేరగాళ్లు...  పొరపాటున ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేశారు అంటే చాలు ఇక వారి ఖాతాలను గుల్ల చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇలా రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగి పోతూనే ఉన్నాయి అంతేకాకుండా నిజమైన వెబ్సైట్లకి డూప్లికేట్ వెబ్సైట్లకి కూడా ఎలాంటి తేడా ఉండకుండా ప్రజలను మోసం చేసేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇటీవలే తిరుమల శ్రీవారి భక్తులు అందరినీ టీటీడీ బోర్డు అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్ సైట్ ను నమ్మి భక్తులు ఎవరు మోసపోవద్దు అంటూ హెచ్చరించింది. ఇక ప్రజల్లో ఉన్న కరోనా  వైరస్ భయాన్ని క్యాష్ చేసుకుని డబ్బులు దండుకునేందుకు ప్రయత్నించిన ఒక నకిలీ వెబ్ సైట్ కు అడ్డుకట్ట వేసింది టిటిడి బోర్డు. తిరుమలలో టిటిడి ప్రసాదం పేరుతో నకిలీ వెబ్ సైట్ సృష్టించి అక్రమ వ్యాపారం సాగిస్తున్న ముఠా గుట్టురట్టు చేయడంతో... శ్రీవారి భక్తులు అందరూ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయానికి ప్రత్యేకంగా బాలాజీ ప్రసాదం. కామ్  పేరుతో ఒక వెబ్సైట్ రూపొందించారు.


 శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఆన్లైన్ లో 500 రూపాయలకు విక్రయించేందుకు నిర్ణయించారు. ఇక బల్క్  ఆర్డర్ పేరుతో నాలుగు లడ్డూలను వెయ్యి రూపాయలకు విక్రయించేందుకు ఆఫర్ కూడా పెట్టి అందరిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఇలా లడ్డు బుక్ చేసుకునే వారికి లడ్డూ ప్రసాదం డోర్ డెలివరీ చేస్తాము అంటూ నమ్మించారు. నకిలీ వెబ్ సైట్ వ్యవహారం కాస్త టీటీడీ బోర్డు వరకు వెళ్లడంతో వెంటనే టిటిడి బోర్డు అధికారులు స్పందించారు. వెంటనే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసిన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి వెబ్సైట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నకిలీ వెబ్ సైట్ ను నమ్మి మోసపోవద్దని అటు భక్తులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: