తస్మాత్ జాగ్రత్త.. హోటల్లో బిర్యాని తిని.. చివరికి 20 మంది..?

praveen
ఈ మధ్యకాలంలో ఇంట్లో వండిన వంటకాలు కంటే హోటల్లో మసాలాలు దట్టించిన వంటకాలు పైన ఎక్కువగా అందరూ మొగ్గుచూపుతున్నారు అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే హోటల్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోయారు నేటి రోజుల్లో జనాలు..  అయితే హోటల్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ కూడా రుచి బాగా ఉండడంతో చివరికి ఆరోగ్యం పాడైనా సరే అని హోటల్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చెబుతున్నారు అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో హోటళ్ళు ఆహారంలో నాణ్యత లేకపోవడంతో ఇక ఆ హోటల్లో ఆహారం తిని  ఎంతో మంది అస్వస్థతకు గురవుతున్నా ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఎంతో ఆనందంగా హోటల్కు వెళ్లి బిర్యాని తిన్నారు   20 మంది.ఈ క్రమంలోనే కేవలం నిమిషాల వ్యవధిలోనే 20 మంది  అస్వస్థతకు గురి కావడంతో ఒక్కసారిగా ఈ ఘటన కలకలం సృష్టించింది ఈ ఘటన ఒంగోలు నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానికంగా ఉండే ఖాదర్  షా వలీ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఆదివారం సాయంత్రం కర్నూలు రోడ్డులో ఉన్న ఓ హోటల్ కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు.. తర్వాత హోటల్ నుంచి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు కావడం మొదలయ్యాయి. ఇక వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు సమీపంలోని ఆసుపత్రికి వెళ్లారు.



 అయితే ఇలా తమ స్వస్థతకు గురి కావడానికి ఫుడ్ పాయిజన్ కారణం అయి ఉండవచ్చని ఖాదర్ షా  భావించాడు. ఈ విషయాన్ని ఆహారభద్రత అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమం లోనే సదరు హోటల్ పై దాడులు నిర్వహించిన ఆహార భద్రతా అధికారులు అనుమానంగా అనిపించి మాంసాహారాలను కూడా పరీక్షల నిమిత్తం పంపించారూ.  అది కేవలం ఖాదర్ షా  కుటుంబంతో పాటు హోటల్లో భోజనం చేసిన మరికొంతమంది మొత్తంగా 20 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు గుర్తించారు.  ఈ క్రమంలోనే ఆహార నమూనాలకు సంబంధిత రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతా అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: