కరోనా వస్తే పురుషుల్లో ఆ సామర్థ్యం పూర్తిగా పడిపోతుందా..
విషయానికొస్తే.. దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌తో పురుషుల్లో దీర్ఘకాలిక "అంగస్తంభన".. సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. దీనిని తేలికగా తీసుకోకుండా వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు..వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్నందున కాపలాదారులను నిరాశపరచవద్దని అంటువ్యాధి నిపుణుడు డాక్టర్ దేనా గ్రేసన్ పేర్కొన్నారు.. ఈ వైరస్ వస్తే మనిషి సంసార జీవితం పై ఎఫెక్ట్ పడుతుందని, ముఖ్యంగా పురుషుల్లో శాశ్వత అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు.
ఈ వైరస్ నుంచి కోలుకున్న తర్వాత పడకగదిలో మనిషి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందనే భయాలు ఇప్పుడు వస్తున్నాయని నివేదికలు చెప్తున్నాయి. ఎక్కువ కాలం పాటు మనిషిలో కరోనా వైరస్ ఉన్నట్లయితే నాడీ సంబంధ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. వైరస్ తగ్గినా కూడా కరోనా పై జాగ్రత్తలు తీసుకోవాలనీ ఆయన చెప్పారు. 36,011 తాజా ఇన్ఫెక్షన్లతో భారతదేశంలో ఆదివారం ఉదయం వరకు మొత్తం 96,44,222 కేసులు నమోదయ్యాయి.. ఇక దేశం మొత్తం మీద నిన్న ఒక్కరోజే 482 మంది మృత్యువాత పడ్డారు. దీంతో 1,40,182 మంది ఇప్పటివరకు కరోనా వల్ల చనిపోయారు. ప్రస్తుతం 4,03,248 గా ఉండగా.. 91,00,792 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 41,970 మంది వైరస్ ను జయించారు.. వ్యాక్సిన్ వచ్చే వరకు తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన పేర్కొన్నారు..