తేజస్వి యాదవ్: రైతుల కోసం నేను చావడానికైనా సిద్ధమే...!
దేశానికి అన్నం పెట్టే రైతులకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కలకలం కొనసాగుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా ఒకచోట గుమి కూడడం... ఎటువంటి అనుమతి పొందకుండానే.. నిరసన వ్యక్తం చేసినందుకు 18 మంది నాయకుల పై కేసు నమోదైంది. దీనిపై స్పందించారు తేజస్వి యాదవ్. ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ బీహార్ ప్రభుత్వం పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పిరికి ముఖ్యమంత్రి నేతృత్వంలో నడుస్తున్న బీహార్ ప్రభుత్వం...... రైతుల గొంతు వినిపిస్తే మా పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదేమి న్యాయం అంటూ బీహార్ సర్కారుపై మండిపడ్డారు తేజస్వి.
రైతులకు కొండంత అండగా నిలవాల్సిన ప్రభుత్వమే వారికి అన్యాయం తలపెడుతుంది అంటూ ధ్వజ మెత్తారు. మీకు నిజమైన ధైర్యం బలం ఉంటే నేరుగా మమ్మల్ని అరెస్ట్ చేయండి. లేదంటే నాకు నేనుగా లొంగి పోతాను. రైతుల కోసం ప్రాణం ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు నేనే రైతుల కోసం ఉరి తీసుకోవడానికి సైతం రెడీగా ఉన్నాను అంటూ సవాల్ చేశారు తేజస్వి యాదవ్. కాగా ఈ విషయంపై ఢిల్లీ లో నిరసనలు జరుగుతున్నాయి. మరి కొంత మంది ప్రముఖ నాయకులు కూడా రైతులకు మద్దతుగా నిలిచేందుకు భావిస్తున్నట్లు సమాచారం. ఇకనైనా ప్రభుత్వం రైతుల విషయంపై తన వైఖరిని మార్చుకుంటుందో లేదో చూడాలి.