ప్రియురాలితో ఏకాంతంగా భర్త... అంతలో తలుపు తీసిన భార్య.. చివరికి ఘోరం..?

praveen
ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి అనే విషయం తెలిసిందే. అయితే రోజురోజుకు జరుగుతున్న ఘటనలు సంబంధించిన వార్తలు చదువుతున్నప్పటికీ ఎక్కడ ఎవరి లో మాత్రం మార్పు రావడంలేదు కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల మోజులో పడుతున్న ఎంతోమంది చివరికి దారుణంగా హత్యలు  చేయడం లేదా హత్యకు గురవ్వడం లాంటి ఘటనలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి.  కట్టుకున్న  బంధానికి కాస్తయినా విలువ ఇవ్వడం లేదు ఈ మధ్యకాలంలో ఎవరు.



 ఇక్కడ అక్రమ సంబంధం నేపథ్యంలో మరో దారుణ ఘటన జరిగి పోయింది. ఏకంగా ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్య చూసింది అన్న కారణంతో ప్రియురాలితో కలిసి భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త ఘటన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో చోటుచేసుకుంది. సురేష్ సుభాషిని భార్యాభర్తలు. సురేష్ స్థానిక మున్సిపల్ ఆఫీస్ లో పని చేస్తూ ఉంటాడు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో శ్రీకాళహస్తికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు సురేష్. కొన్ని రోజులపాటు భార్యకు తెలియకుండా సదరు మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ రాసలీలల్లో మునిగి తేలుతూ వచ్చాడు.



 ఇక ఇటీవల సురేష్ ప్రియురాలు బంధువులు చనిపోవడంతో సూళ్లూరుపేటకు వచ్చింది.ఇక ఇది తెలుసుకున్న సురేష్ ప్రియురాలితో ఏకాంతంగా ఉన్నాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన భార్య సుభాషిని వెళ్లి చూడగా ప్రియురాలితో రాసలీలల్లో మునిగి తేలిన భర్తను చూసి ఒక్క సారిగా షాక్ అయింది. దీంతో భర్తను నిలదీసింది. ఈ క్రమంలోనే నీచానికి ఒడిగట్టాడు భర్త ఏకంగా ప్రియురాలితో కలిసి భార్య సుభాషినిపై దాడి చేసి పురుగుల మందు తాగించారు. ఇంతలో అరుస్తున్న సుభాషిని చూసి ఇరుగు పొరుగు వారు వచ్చి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: