రామ్ చరణ్ పెద్ది నుంచి భారీ ప్రెస్ మీట్.. ఎందుకంటే..?

Divya
టాలీవుడ్లో మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరు సంపాదించిన చిత్రం రామ్ చరణ్ నటించిన పెద్ది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమా వాస్తవంగా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతోంది. దీంతో ఇటీవల ఒక సినిమా ఈవెంట్లో జూన్ 25న ఈ సినిమాని విడుదల చేస్తామంటూ డైరెక్టర్ బుచ్చిబాబు ప్రకటించారు. ఈ సందర్భంలోనే చిత్ర బృందం ఈ రోజున ఒక కీలకమైన ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.


ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు పెద్ది సినిమా మేకర్స్ భారీ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ బుచ్చిబాబు మాత్రం జూన్ 25న వస్తుందంటూ ప్రకటించడం జరిగింది .అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా నిన్నటితో ముగిసింది. సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో కూడా సరికొత్త వ్యూహాన్ని చిత్ర బృందం అనుసరిస్తున్నట్లు వినిపిస్తున్నాయి.



సాధారణంగా సినిమా విడుదలకు ముందు అన్ని పాటులను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ పెద్ది సినిమా విషయంలో మాత్రం ఇప్పటికి కేవలం రెండు సాంగ్స్ మాత్రమే విడుదల చేశారు. ఇకమీదట ఒక పాటను మాత్రమే విడుదల చేయాలని, అదే శృతిహాసన్ నటించిన సాంగ్. అయితే ఇది స్పెషల్ సాంగ్ కాదని సినిమా కథలో భాగంగా వచ్చే ఒక స్పెషల్ సాంగ్ అన్నట్లుగా వినిపిస్తోంది. శృతిహాసన్ ఎనర్జీ , మేకింగ్ స్టిల్స్ రామ్ చరణ్ డాన్స్ నెక్స్ట్ లెవెల్ కు ఈ పాటను తీసుకువెళ్తాయని తెలుస్తోంది. ఇక తర్వాత మిగిలిన పాటలన్నీ కూడా డైరెక్ట్ గా సినిమాలోనే చూసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ కి రామ్ చరణ్ వస్తారా లేదా అనే అనుమానాలు మాత్రం అభిమానులు సందేహంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: