గ్రేటర్ యుద్ధం : అంచనాలు తారుమారు.. సీన్ రివర్స్..?
ఈ క్రమంలోనే అందరూ టిఆర్ఎస్ గెలుస్తుంది అని అనుకున్నారు కానీ అసలు ఫలితాలు వెలువడిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం పూర్తిగా తలకిందులు అయిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేయాలి అనుకున్న బీజేపీకి జిహెచ్ఎంసి ఎన్నికల రూపంలో ఒక సువర్ణ అవకాశం వచ్చింది ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ పెద్దలతో పాటు అటు ఢిల్లీ పెద్దలు కూడా గల్లీ ఎన్నికల కోసం రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించడం బిజెపికి ఎంతగానో కలిసి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిజెపి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయిపోయాయి. గ్రేటర్లో ఓటర్ల నాడిని పట్టడంలో సర్వేలన్నీ పూర్తిగా విఫలం అయి పోయాయి. ఏ ఒక్క సంస్థ కూడా వెల్లడించిన అంచనాలు నిజమైన ఫలితాలకు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నింటినీ తారుమారు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ కేవలం 55 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా అనూహ్యంగా ఊహించని విధంగా బిజెపి నలభై ఎనిమిది స్థానాలలో విజయం సాధించడం సంచలనంగా మారిపోయింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విషయంలో సీన్ రివర్స్ అయిపోయింది.