గ్రేటర్ యుద్ధం : ఓట్ల లెక్కింపు జరిగిన.. ఆయనదే తుది నిర్ణయం అంటున్న ఈసీ..?

praveen
నేడు జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతోంది అన్న విషయం తెలిసినదే.  దీని కోసం సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల పోరు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మొత్తం ఆకర్షించింది అన్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపులో ఎవరు గెలవబోతున్నారో ఎవరు పోతున్నారు అనే దానిపైనే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు చూపు మొత్తం ఉంది.  ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో  కూడా ప్రస్తుతం టెన్షన్ నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభం కానుంది అనే విషయం తెలిసిందే.

 గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏకంగా 50 వేల మందికి పైగా పోలీసులు ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల కోసం పహారా కాస్తూ ఉండటం గమనార్హం. ఇక పటిష్ట బందోబస్తు మధ్య ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో భాగంగా మొదటి రౌండ్లో మెహదీపట్నం డివిజన్ కు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


 అయితే తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించిన తర్వాత ఆ తర్వాత బాలెట్ పత్రాలను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుళ్లు  ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్కు 14 టేబుల్ లతో కూడిన కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక రిటర్నింగ్ అధికారి తో పాటు ఒక పరిశీలకుడు కూడా ఉంటారు అంటూ ఎన్నికల సంఘం తెలిపింది అయితే అనుమానిత ఓట్ల విషయంలో ఆ కేంద్రంలో ఎవరైతే రిటర్నింగ్ అధికారి ఉన్నారో  ఆయనదే  తుది నిర్ణయం అంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: