పులుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

Vasu
పులుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా అటవీ గ్రామాల్లో సంచరిస్తూ పశువులు, ప్రజలపై దాడులు చేస్తున్నాయి. 

 తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా పులుల గాండ్రింపులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే ఇద్దరి ప్రాణాలను పులులు బలిగొన్నాయి. వరుస పులి దాడులతో అధికారులు హైఅలర్ట్ విధించారు. పెంచికల్ పేట, దహెగాం, బెజ్జూర్, కాగజ్ నగర్ మండలాల్లోని 110 గ్రామాల్లో పులి నుంచి రక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేశారు.


ప్రతి గ్రామంలో బీట్ అధికారి, సర్పంచ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తారు. పులుల సంచారం నేపథ్యంలో కొండపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రజలెవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులుల కోసం కొండపల్లి అటవీ ప్రాంతంలో మూడు బోన్లను ఏర్పాటు చేసి, 18 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాగజ్ నగర్ లో మూడు పులులు సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: