డిసెంబర్ 4న అన్ని పార్టీల లీడర్లతో మాట్లాడనున్న ప్రధాని

Hareesh
అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల తో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుక్రవారం సమావేశం కానున్నారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం ప్రభావం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానమంత్రి దేశంలో తయారవుతున్న కరోనా వాక్సిన్ పరిస్థితులను తెలుసుకున్న తరువాత నిర్వహిస్తున్న సమావేశం కావడం గమనార్హం.ప్రధాన మంత్రి అహ్మదాబాద్ లోని జయడ్యూస్ క్యాడిలా, పుణె లోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ను స్వయంగా  వెళ్లి వాక్సిన్ తయారవుతున్న దశలను వాటి అభివృద్ధి ని కనుక్కొన్న విషయం తెలిసిందే. 
గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు 40000 కింద రావడం ఈ నెలలో  7 వ సారి కావడంతో దేశములో కరోనా ప్రభావం తగ్గుతుంది కానీ ప్రజలు మరింత శ్రద్ధ తీసుకోవల్సిన అవసరం ఉందని కొందరు నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 9431691 కరోనా కేసులు నమోదు కాగా 8847600 మంది కోలుకున్నారు.ఈ రోజు 38772 కరోనా కేసులు నమోదయ్యాయి.అలాగే దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 137139 కి చేరింది. దేశంలో కరోనా నుo డి కోలుకున్న వారి శాతం 93.81 కాగా చనిపోయిన వారి శాతం 1.45 గా నమోదైంది.
ప్రస్తుతం దేశంలో లో కరోనా రోగుల సంఖ్య 446952.మరియు కరోనా కేసుల సంఖ్య ఆగస్టు 7న ఇరవై లక్షలు దాటగా ఆగస్ట్ 23న ముప్పై లక్షలను, సెప్టెంబర్ 5న నలబై లక్షలను, సెప్టెంబర్ 16న 50 లక్షలను, సెప్టెంబర్ 28న 60 లక్షల కరోనా కేసుల సంఖ్య ను దాటింది.అక్టోబర్ 11న 70 లక్షల కేసులు కాగా 80 లక్షల కేసులను అక్టోబర్ 29న, 90 లక్షల కేసులను నవంబర్ 20 న దేశంలో నమోదు అయిన కేసులుగా చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: