ఉప్పల్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి రజిత పరిమేశ్వర్ రెడ్డి..

Hareesh
ఉప్పల్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి రజిత పరిమేశ్వర్ రెడ్డి తరుపున ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఈ ఎన్నికలు రాష్ట్ర ముఖ్యమంత్రి నో లేక దేశ ప్రధానమంత్రి నో నిర్ణయించే ఎన్నికలు కావని మీకు అందుబాటులో వుండే కార్పొరేటర్ ఎన్నికలు అని మీకు అందుబాటులో ఉండేవారికే ఓటు వేయాలని 2016 లో ఉప్పల్ ప్రాంతాన్ని కేటీఆర్ దత్తత తీసుకుంటనని చెప్పి1 రూపాయి కూడా పెట్టి అభివృద్ధి చేయలేదని అన్నారు.

రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని ఇంటి పన్ను రద్దు చేస్తామని ఇంటికో ఉద్యోగం ఇస్తామని గల్లీలలో సిమెంట్ రోడ్లను అద్దాలల చేస్తామని చెప్పారని కానీ ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు.మరియు ఉప్పల్ లో చెత్త ప్లాంట్ను ఏర్పాటు చేసి నీరు, గాలి కాలుష్యం చేశారని పార్కులు అక్రమంగా ఆక్రమించారు అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: