గ్రేటర్ యుద్ధం : మోడీ కోసం.. సీఎం కేసీఆర్ అవసరం లేదు..?

praveen
ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా మారిపోయాయి దుబ్బాక ఉప ఎన్నిక వేడి తగ్గక ముందే జిహెచ్ఎంసి  ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా ఎంతో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పావులు కదుపుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించి తీరాలి అని అన్ని పార్టీలు ప్రస్తుతం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి.



 అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా దుబ్బాక ఉపఎన్నిక సీన్ రిపీట్ చేయాలని బిజెపి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అన్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టింది దీనికోసం బీజేపీకి ప్రస్తుతం మద్దతు కూడా అందుతుంది. ఏపీకి చెందిన బీజేపీ నేతలు రంగంలోకి దిగి తెలంగాణ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడనే  కాదు అటు ఢిల్లీ పెద్దలు కూడా రంగంలోకి దిగుతు  ఉండడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మరింత సంచలనంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.



 జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ఢిల్లీ పెద్దలు అయినా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగేందుకు అంతా సిద్ధమైంది. అయితే ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ టూర్ సందర్భంగా కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం కెసిఆర్ రావాల్సిన అవసరం లేదని కేవలం ఐదుగురు అధికారులు మాత్రమే ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లాలి అంటూ ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యక్తిగత సహాయకుడు తెలియజేశారు. ఇక ప్రధాని మోదీ వచ్చేందుకు షెడ్యూలు  కూడా ఖరారు కావడంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మరింత హాట్ గా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: