మీరు వాడే నూనె కల్తీ అయ్యిందా.. సులభంగా చెక్ చేసుకోండి ఇలా.?
ఆవనూనెలో ఎక్కువగా ఆర్జీమోన్ నూనె కలిపి కల్తీ చేస్తున్నారు ఎంతోమంది మోసగాళ్లు. అయితే మీరు వాడే ఆవ నూనె కల్తీ చేయబడిందా లేదా అని ఎంతో సులభంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఆర్జీమోన్ నూనెను అజీం విత్తనాల నుంచి తయారు చేస్తారు. ఇక నూనె యొక్క క్వాలిటీ పెంచడానికి ఈ ఆర్జీమోన్ నూనెను ఆవ నూనెలో కలుపుతూ ఉంటారు. ఆర్జీమోన్ నూనెను వాడటం ద్వారా ఎక్కువగా అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. అంతే కాదు ఎర్ర రక్త కణాలు దెబ్బతినడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నది కూడా పలు అధ్యయనాలు చెప్పాయి .
అయితే మీ ఆవనూనె కల్తీ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఎంతో సులభమైన మార్గం ఉంది. 5 మి.లీ ఆవ నూనెను టెస్ట్ ట్యూబ్ లోకి తీసుకొని 5 మి.లీ నైట్రిక్ యాసిడ్ కలపి ట్యూబ్‌ను మెల్లిగా కదిలించండి. ఒకేవేళ ఆవ నూనె కల్తీ కాకపోతే, అది ఆమ్ల పొరలో రంగు మార్పును చూపించదు. కల్తీ అయితే ఆవ నూనె విషయంలో, ఆమ్ల పొరలో ఒక నారింజ-పసుపు నుంచి ఎరుపు రంగు అభివృద్ధి చెందుతుంది.ఆర్జీమోన్ నూనె సాంగినారిన్ అనే ఓ విషపూరిత పాలిసైక్లిక్ సాల్ట్ ఉంటుంది. మనం టెస్ట్ ట్యూబ్ లో అవ నూనె, నైట్రిక్ యాసిడ్ కలిపినప్పుడు సాంగునారైన్ నైట్రేట్ ఏర్పడటం వల్ల వెంటనే రంగు మారుతుంది.