గుడ్ న్యూస్ : కేంద్రం కీలక నిర్ణయం.. ఇక 48 గంటలే పని..?
కేంద్ర కార్మిక శాఖ నిబంధనల ప్రకారం ఒక వారం సమయంలో కార్మికులు చేయాల్సిన పని గంటల కంటే ఎక్కువ సమయం కార్మికులతో పని చేయించుకుంటూ.. చివరికి శ్రమ దోపిడీ చేస్తూ ఉంటాయి ఎన్నో కంపెనీలు ఇక తాజాగా కార్మికుల పనివేళలు పై కేంద్ర కార్మిక శాఖ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి కార్మికులందరికీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజుల పాటు ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతో మంది కార్మికులకు కేంద్ర కార్మిక శాఖ తీసుకువచ్చిన కొత్త ప్రతిపాదనలు ఎంతగానో ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కార్మికుల పనివేళలు పై కేంద్ర కార్మిక శాఖ తీసుకు వచ్చిన కొత్త ప్రతిపాదనల ప్రకారం ఒక కార్మికుడు అన్ని రకాల విరామాలతో కలిపి రోజుకు 12 గంటలు మాత్రమే పని చేయాలి. వారంలో గరిష్టంగా రోజుకు ఎనిమిది గంటల చొప్పున కేవలం 48 గంటలు మాత్రమే కార్మికుడు పనిచేయాల్సి ఉంటుంది ఒక రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలి. ఒకవేళ కార్మికుడు అదనంగా పని చేసినప్పుడు ఓటి అలవెన్స్ లభిస్తుంది అంటూ కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదన తీసుకు వచ్చింది. ఇక ఏ కార్మికుడు కూడా అరగంట విరామానికి ముందు 5 గంటలు పని చేయకూడదు అంటూ స్పష్టం చేసింది కేంద్ర కార్మిక శాఖ. అన్ని కంపెనీలు ఈ ప్రతిపాదనలను అమలు చేయాలి అంటూ సూచించింది.