ఫుడ్ డెలివరీ ముసుగులో డ్రగ్స్ పంపిణీ...యువత ఎక్కిడికెళుతోంది...?
కానీ గంజాయి కి బానిసైన ఆ యువకుడు మత్తులో పడి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని సైతం కోల్పోయాడు..... చివరికి ఉపాధికోసం డెలివరీ బాయ్ గా మారాడు. కానీ అదే మత్తు మళ్ళీ అతన్ని సమస్యల వలయంలో చిక్కుకొనేలా చేసింది. అతడి వ్యసనం చివరికి జైలుపాలు చేసింది. ఉపాధి కోసం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో చేరిన బాలాజీ సింగ్ ఓవైపు డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే..... అతనికి ఉన్న వ్యసనం కారణంగా దూల్‌పేటలోని గంజాయి విక్రేతలతో పరిచయాలు పెంచుకున్నాడు. వారితో చేతులు కలిపి మత్తుపదార్థాలను తరలించేందుకు సహకరించాడు. వాళ్లు ఇచ్చే గంజాయిని గచ్చిబౌలిలోని కొందరు ఐటీ ఉద్యోగులు, మాదాపూర్‌లోని హాస్టల్ విద్యార్థులకు సరఫరా చేసేవాడు.
ఈ క్రమంలోనే విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు. ఇదే అలవాటుగా మారిన బాలాజీ సింగ్ గంజాయి కోసం నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం వెళ్ళాడు గంజాయితో పాటు మత్తు ద్రావణాన్ని నగరానికి తీసుకొచ్చాడు. వాటిని ప్యాకెట్ల లో నింపి పలువురికి సరఫరా చేస్తూ వచ్చాడు...సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టగా బాలాజీ దగ్గర 800 గ్రాముల మత్తు ద్రావణం తో పాటు, కిలో గంజాయి దొరికింది..... వాటిని స్వాధీనం చేసుకుని బాలాజీసింగ్‌ను అరెస్టు చేశారు పోలీసులు.