మాకు తెలుసు.. నోరు అదుపులో పెట్టుకో.. చైనాకు ఆస్ట్రేలియా స్ట్రాంగ్ వార్నింగ్..?

praveen
చైనా వ్యవహారం రోజు రోజుకూ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారుతుంది అన్న  విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల తో పోటీ పెట్టుకోవడం కాదు శత్రుత్వం పెట్టుకుంటూ పోతుంది చైనా. దీంతో ప్రపంచ దేశాలు క్రమక్రమం గా చైనాకు శత్రుదేశాల గా మారిపోతున్నాయి. చిన్న దేశాలు పేద దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాలతో శత్రుత్వం  పట్టుకొని ముందుకు సాగుతుంది  ఈ మధ్య కాలంలో అయితే ప్రపంచ అగ్ర రాజ్యాలు చైనాకు శత్రువు దేశాలుగా మారుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఆస్ట్రేలియా చైనాకు స్ట్రాంగ్  వార్నింగ్ ఇచ్చింది.

 మొన్నటి వరకు కేవలం అమెరికాతో మాత్రమే ఉన్న  శత్రుత్వం జో బైడెన్  వచ్చిన తర్వాత అది కాస్త తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్న చైనాకు ఇటీవలే ఆస్ట్రేలియా ఇచ్చిన వార్నింగ్  కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా  కనిపిస్తుంది. 5జి  టెక్నాలజీ  విషయంలో చైనాకు అమెరికా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.5జి  టెక్నాలజీకి సంబంధించిన హువాయ్  కంపెనీ చైనా లో ఉండడం వలన తమ దేశంలో సదరు 5జి  నెట్వర్క్  అనుమతించటం లేదు అంటూ  మిత్ర  దేశాలతో సందేశాన్ని  పంచుకుంది అమెరికా . ఇక ఇలాంటి క్రమంలోనే ఆస్ట్రేలియా కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

 ఆస్ట్రేలియా కూడా అమెరికా తరహ  నిర్ణయం తీసుకొని ఇటీవలే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. దీంతో వెంటనే స్పందించిన చైనా విదేశాంగశాఖ చైనాను శత్రువుగా భావిస్తే చైనా శత్రు గానే ఉంటుంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించింది  ఆస్ట్రేలియా. మా జాతి ప్రయోజనాలకు అనుగుణంగా మా చట్టాలు ఉంటాయి.  మా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై  ఉందని... విదేశీ పెట్టుబడుల విషయంలో ఎలా వ్యవహరించాలన్నది మాకు తెలుసు..  నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అంటూ ఆస్ట్రేలియా ప్రధాని చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: