జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా.. బీజేపీ సదవకాశం..?
ఇలా క్రమక్రమం గా బిజెపి రాష్ట్రం లో తమ కేడర్ పెంచుకునేందుకు ఎన్నో రకాలు గా ప్రయత్నాలు చేస్తుంది. ఇక మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యం లో ఈ ఎన్నికల్లో మరింత వ్యూహాత్మకం గా వ్యవహరించి టిఆర్ఎస్ కు మరోసారి భారీ షాక్ ఇవ్వాల ని భావిస్తుంది ఉంది బీజేపీ. ఎంతో మందికి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. బిజెపి తరఫున జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారి బయోడేటా ను స్వీకరించేందుకు సిద్ధమైంది బిజెపి.
నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆశా వాహుల కు సంబంధించిన బయో డేటా లను ఆయా జిల్లాల అధ్యక్షులు తీసుకోనున్నారు. గ్రేటర్ పరిధిలో ఆరుగురు అధ్యక్షులను బిజెపి నియమించింది. డివిజన్ల వారీగా వారు అభ్యర్థులకు పనితీరుపై సర్వే నిర్వహించి వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు నిర్ణయించనుంది బిజెపి. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఊహించని ఎత్తుగడ అని అంటున్నారు విశ్లేషకులు. ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్నది రానున్న రోజుల్లో చూడాలి మరి.