భారత్ మెరుపు దాడి.. శవాలతో పరుగులు పెట్టిన పాక్ సైన్యం..?

praveen
ఇటీవలి భారత్ పాకిస్థాన్ సరిహద్దు ల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏకం గా పాకిస్తాన్ ఒక్కసారి గా కాల్పుల కు పాల్పడడం తో ఏకంగా నలుగురు భారత జవాన్లు వీర మరణం పొందారు. దీంతో ఒక్కసారిగా విజృంభించిన భారత ఆర్మీ పాకిస్తాన్ పై మెరుపు దాడి చేసింది. ఏకంగా మోర్టార్ గన్స్   తో దాడి చేయడం తో పాటు పాకిస్తాన్ సరిహద్దు లోకి దూసుకు పోయి మరి పాకిస్తాన్ సైనికులు తరిమి తరిమి కొట్టింది  భారత సైన్యం.



 అంతే కాకుండా మునుపెన్నడూ లేని విధంగా పాకిస్తాన్ ఊహించని విధంగా ఏకంగా మిసైల్స్ తో దాడి చేయడం తో పాకిస్తాన్ సైనికులు కమాండర్స్  ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కమాండర్ స్థాయి సైనికులు కూడా 18 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే భారత సైన్యం ఏకంగా పాకిస్తాన్ సరిహద్దు లోకి ఐదు కిలోమీటర్ల లోపు దూసుకెళ్లి మెరుపు దాడి చేయడం తో.. ఏకంగా పాకిస్తాన్ సైనికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు పెట్టినట్లు భారత విశ్లేషకులు చెబుతున్నారు.



 అంతే కాకుండా భారత సైన్యం మెరుపుదాడిలో మరణించిన మిగతా సైనికుల మృతదేహాలను భుజాన వేసుకుని పాకిస్తాన్ సైనికులు సరిహద్దుల్లో పరుగులు పెట్టారట. అయితే కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ పై  భారత్ చేసిన అతి పెద్ద దాడి ఇదే అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ దాడిలో ఎంత  మంది సైనికులు చనిపోయారు అన్న విషయం మాత్రం పాకిస్తాన్ బయటకు చెప్పదని.. దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత పాకిస్తాన్ స్వయంగా ఈ విషయాన్ని బయట పెడుతూ ఉంటుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: