టీడీపీ లో వారసుల రాజకీయం వర్కవుట్ అవ్వడం లేదుగా ?

అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీకి ఊపు తీసుకువచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ మధ్యనే పార్టీ కమిటీలను నియమించిన ఆయన, ఆ కమిటీల ద్వారా ఎక్కడికక్కడ నాయకులు యాక్టివ్ అవుతారని, ఆ పార్టీ ని అధికారం వైపు నడిపించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తారు అని, బలంగా నమ్ముతూ వస్తున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత , ఈ స్థాయిలో పదవులను భర్తీ చేయడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే టిడిపిలో  వారసుల రాజకీయాలకు కాలం అంతాగా కలిసి వస్తున్నట్లు గా కనిపించడం లేదు. పార్టీలోని సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నా, వారి వారసులు రాజకీయంగా చక్రం తిప్పేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, అవేమి వర్క్ ఔట్ కావడం లేదు.



 2019 ఎన్నికల్లో ఎంతో మంది సీనియర్ నాయకుల వారసులు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు ఎన్నికల రంగంలోకి దిగినా, అందరికీ నిరాశే ఎదురయింది. టిడిపి ఆ ఎన్నికల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది అని, సీనియర్ నాయకులతో పాటు, వారసులు ఊహించలేకపోయారు  అందుకే రాంగ్ ఎంట్రీ ఇచ్చి దెబ్బతిన్నట్లు గా కనిపిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ రాజకీయ చక్రం తిప్పేందుకు సీనియర్ నాయకుల వారసులు ఎప్పటి నుంచో ఎదురు చూపులు చూస్తున్నారు. అయినా వారికి కాలం కలిసి రానట్టుగానే కనిపిస్తోంది. రాయలసీమ నుంచి చూస్తే gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ శ్రీకాళహస్తిలో ఓటమి తర్వాత దాదాపు నియోజకవర్గానికి దూరమయ్యారు. 



చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ కుమారుడు భాను సైతం అంతగా యాక్టివ్ గా లేరు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ కి కాలం కలిసి రావడం లేదు. అలాగే జెసి బ్రదర్స్ వారసులు జేసీ పవన్ కుమార్ రెడ్డి , అస్మిత్ రెడ్డి పరిస్థితి ఇదే విధంగా తయారయింది.కర్నూలు జిల్లా భూమా అఖిలప్రియ మంత్రిగా పనిచేసినా, ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ క్యాడర్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అలాగే కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు సైతం ఇదే రకమైన ఇబ్బందుల్లో ఉన్నారు.ఇక కర్నూలు జిల్లా చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ సైతం అంతగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే రాయలసీమ నుంచి కోస్తా ఉత్తర ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సీనియర్ నాయకులు బాధ అంతా ఇంతా కాదు రాజకీయం రిటైర్ అవుతున్న సమయంలో తమ వారసులు రాజకీయ చక్రం తిప్పుతారు అనుకుంటూ ఉంటే పరిస్థితి ఈ విధంగా తయారయింది అని, ఇక ముందు ముందు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళలో వారు మునిగిపోయారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: