ఏం కష్టం వచ్చిందో.. చివరికి ప్రాణాలు విడిచింది..?
ముఖ్యంగా భర్తతో గొడవ జరిగిందని లేదా... భర్త మందలించాడని ఇలా చిన్నచిన్న కారణాల కే ఎంతోమంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు తెరమీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగు లోకి వచ్చింది. కుటుంబ కలహాలు లేదా ఇంకేదైనా కారణం అన్నది తెలియదు కానీ... కఠిన నిర్ణయం తీసుకున్న వివాహిత చివరికి బలవన్మరణాని కి పాల్పడింది. జీవితాన్ని అర్ధాంతరం గా ముగించింది సదరు మహిళ. కుటుంబం లో తీరని విషాదాన్ని నింపింది. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు లోకి వచ్చింది.
ఏకంగా తాము ఉంటున్న అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది వివాహిత. గుంటూరులోని హౌసింగ్ బోర్డు కాలనీలో సుభాషిని అనే వివాహిత భర్తతో కలిసి ఉంటుంది. ఇక ఇటీవలే ఏకంగా భర్త ఆఫీస్ కి వెళ్ళిన సమయంలో కఠిన నిర్ణయం తీసుకున్న సుభాషిని అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన స్థానికులు హుటాహుటిన సుభాషినినీ సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే సదరు మహిళకు తీవ్ర గాయాలపాలై రక్తస్రావం జరిగడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.