పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీమ్.. కోటీశ్వరులు కావచ్చు..?
కాగా ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లలో పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం కారణంగా ఎలాంటి రిస్క్ లేకుండానే కచ్చితమైన లాభం పొందేందుకు అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఆర్డీ, కిసాన్ వికాస్ పత్ర వంటి పథకాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతే కాదు ఇలాంటి సేవింగ్ స్కీమ్ లలో డబ్బులు కట్టడం ద్వారా ఆదాయ పన్ను చట్టం నుంచి కొన్ని మినహాయింపులు కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో డబ్బులు పెట్టడం ద్వారా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. 25 ఏళ్ళ మెచ్యూరిటీ కాలానికి ప్రతి నెల 12,500 వరకు ఇన్వెస్ట్ చేయాలి. వడ్డీరేటు 7.1 శాతంగా ఉంటుంది. ఇలా ఇరవై ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే చేతికి ఏకంగా ఒక 1.03 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. ఇక రికరింగ్ డిపాజిట్ లో భాగంగా ప్రతి నెలా 12,500 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 5.8 శాతం వడ్డీ లభించి 27 ఏళ్లు మెచ్యూరిటీ సమయం పూర్తయిన తర్వాత 99 లక్షల వరకు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇలా పోస్ట్ ఆఫీస్ లో లభించే సేవింగ్ స్కీమ్ ల ద్వారా కూడా అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.