వామ్మో.. ఇదేం తెలివి.. ఇలాంటి దొంగను ఎప్పుడు చూసి ఉండరు..?
సాధారణంగా ఎవరైనా దొంగతనానికి పాల్పడ్డారు అంటే విలువైన వస్తువులను నగదు నగలు దొంగతనం చేస్తూ ఉంటారు... ఈ మధ్య కాలంలో ఎంతో చాకచక్యంగా ఇంట్లో ప్రవేశిస్తూ ఉన్న దొంగలు విలువైన వస్తువుల కు బదులు ఉల్లిపాయలను దొంగలించడం.. లేదా తమకు కావాల్సిన వస్తువులు దొంగిలించుకుని మిగతావన్నీ అక్కడే అలాగే ఉంచడం లాంటి ఘటనలు కూడా ఎన్నో తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఓ వెరైటీ దొంగ సీసీ కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సాధారణంగా ఇప్పటివరకు అందరూ కూడా బంగారం డబ్బులు లేదా వాహనాలు ఎత్తుకెళ్ళడం లాంటివి చూశాం ఇక మరికొన్నిసార్లు రేట్లు భారీగా పెరిగిన సమయంలో ఉల్లిపాయలు ఎత్తుకెళ్లిన ఘటనలు కూడా చూశాం. కానీ ఇక్కడ మాత్రం అంతకుమించి దొంగతనం అనేలా చేసింది మహిళ. ఈ వింత దొంగతనం కాస్త సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఎస్సార్ నగర్ పరిధిలోనే బల్కంపేట లో ఇంటి ముందు పెట్టిన పూల కుండీలను ఎత్తుకెళ్లింది ఓ మహిళ. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో సంచులు తెచ్చుకొని మరి పూల కుండీలను సర్దేసింది. ఇక ఈ సన్నివేశం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో యజమానులు చూసి అవాక్కయ్యారు.