వైయస్సార్ పార్టీ అసెంబ్లీకి రెడీ

Narayana Molleti
ఆంధ్రప్రదేశ్ శాసనసభపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ పార్టీ శానససభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం శానససభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారు బుధవారం శాసనసభను పరిశీలించినవారిలో శ్రీకాంత్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నారు.  కాగా పాత అసెంబ్లీని ఆంధ్ర ప్రధేశ్‌కు కేటాయిండంతో అందులో 175 మంది ఎమ్మెల్యేలు కూర్చోనేందుకు సర్వం సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్  మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఒక్క మీడియా పాంయింట్ ను మాత్రం వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సిద్దం చేస్తామని, ప్రస్తుతం మీడియా పాంయింట్ జరిగే ప్రదేశంలోనే మీడియా పాంయిట్‌ను ఏర్పాటు చేసినట్లు యనమనల తెలిపారు. సమావేశాలు మొదటి రోజున ప్రొటెం స్పీకర్ 9.50 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. శుక్రవారం స్పీకర్ ఎన్నిక అనంతరం బీఏసీ సమావేశం ఉంటుందని యనమల అన్నారు. ఐదురోజుల పాటు జరగబోయే సమావేశాలు తొలి మూడు రోజులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు మిగిలిన రెండు రోజులు అసెంబ్లీలో వాడి వేడి చర్చజరగనుంది. ప్రతిపక్షంగా కేవలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రమే అసెంబ్లీలో ఉండడంతో సమావేశాలపై ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: