కొత్త జిల్లాల ఏర్పాటులో ఎందుకంత కన్ఫ్యూజన్..?
విశాఖ ని పరిపాలన రాజధాని గా, అమరావతి ని శాసన రాజధాని గా, కర్నూర్ ని న్యాయ రాజధాని గా మలిచిన ఘనత ఆయనకే దక్కుతుంది. సొంత పార్టీ నేతలకు కూడా జగన్ గురించి పూర్తి గా అర్థం చేసుకునే ఉంటారు.. ప్రతిపక్ష నేతలకైతే జగన్ ఎలాంటి స్వభావుడో అర్థమైపోయింది.. తండ్రి వైఎస్సార్ లాగ మెతకమనిషి కాదని తెలిసిపోయింది..ప్రజలకు కన్నా బిడ్డలా జగన్ సేవ చేస్తూనే అవినీతి బకాసురులు పాలిట యముడవుతున్నాడు.. అవతలివాళ్ళు ఒకటిస్తే తను మూడిచ్చే రకం అని అర్థమయిపోయింది..
ముఖ్యంగా అవినీతి విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.. అవినీతి చేసిన వాళ్ళను ఎంతటి స్థాయిలో ఉన్నా వదిలిపెట్టడం లేదు.. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో నూతన జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కారు కసరత్తులు చేస్తున్నారు.అందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సబంధించి జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు.సామాజిక మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 32 జిల్లాలు ఏర్పాటు కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొత్తగా ఏర్పడుతున్న జిల్లాలు ఇవేనంటూ వాట్సాప్,ఫేస్బుక్,ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా 32 జిల్లాల పేర్లతో పాటు అసెంబ్లీ స్థానాలతో కూడిన లిస్ట్ ఒకటి హల్చల్ చేస్తుంది. పలువురు ఆ వార్తను విశ్వసిస్తుండగా మరికొందరు అదంతా అసత్య ప్రచారం అంటూ దాన్ని కొట్టిపడేస్తున్నారు.