దీపావళిని ఇలా చేస్తే అందరికీ సంతోషాలే...!
అలానే దీపావళికి మన ఇంటిని అలంకరించడానికి ఉపయోగించే దీపాలను కూడా చైనావి కాకుండా మన దేశీ మట్టి ప్రమిదలను కొనుగోలు చేస్తే ఆ ప్రమిదల కళాకారుడు , వారి కుటుంబం కూడా ఈ దీపావళి పండుగ రోజున దీపావళిని జరుపుకుంటారు. దీపం నుండి దుస్తుల వరకు ఏదైనా ఒక దాని ఫోటో తీసి అది ఎవరి వద్దైతే కొన్నారో ఆ విక్రేతను #Local4Diwali అని టాగ్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికీ తెలుస్తుంది.
అలానే అందరు అనుసరిస్తే మన స్వదేశీ తయారీ దారులు ఈ దీపావళి వేళ మన తో పాటుగా దీపావళిని జరుపుకోగలుగుతారు. అంత ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ దీపావళి నాడు ఇలా అనుసరించి దీపాలను వెలిగించి .... ఆ చీకట్లను మన జీవితాల తో పాటు తోటి భారతీయుల జీవితాల నుండి కూడా చెరిపేద్దాము.