బైడెన్ విద్యాభ్యాసం ఎంతవరకు సాగింది...?
అర్క్‌మెర్ అకాడమీలోచదువుకున్నారు బైడెన్. స్కూల్ విద్య తర్వాత మొదట యూనివర్సిటీ ఆఫ్ డెలవేర్‌లో, తరువాత సిరక్యూస్ యూనివర్సిటీ లా స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1965లో డెలవేర్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీలో గ్రాడ్యూయేషన్ చేశారు. సైరకస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా లో... లా పూర్తి చేశారు. స్కాలర్‌షిప్ పొందుతూ ఈ కోర్సు పూర్తి చేశారు. లా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాక, రాజకీయాల్లోకి రాకముందే 1970 నుంచి 1972 వరకు న్యూ కాజిల్ కౌంటీ కౌన్సిల్‌లో పనిచేస్తూ.. బైడెన్ డెలావేర్‌కు అటార్నీగా తిరిగి వచ్చారు. 1965లో డెలావేర్ విశ్వవిద్యాలయం నుండి తన బ్యాచిలర్ డిగ్రీని సంపాదించాడు. చరిత్ర, రాజకీయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. సిరక్యూస్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందే ముందు డెలావేర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు బైడెన్. 1969 లో న్యాయవాదిగా అయ్యాడు.మొత్తానికి బైడెన్ సుదీర్ఘ కాలంలో ఎన్నో పరిణామాలు దాగి ఉన్నాయి.