భీకరమైన ఆయుధాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన ఫ్రాన్స్.. భారత్ కి మరింత బలం..?
ఈ క్రమంలోనే భారత్ పై చైనా ఏక్షణంలోనైనా యుద్ధానికి పాల్పడే అవకాశం ఉంది. ఇక ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు కూడా చైనాకు ఎంతో అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో చైనా మరింత దూకుడుగా భారత్ పై యుద్ధానికి దిగే అవకాశం ఉంది అని భావిస్తున్న భారత్ క్రమక్రమంగా భారత ఆర్మీని మరింత పటిష్టవంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏకంగా తొమ్మిది రాఫెల్ యుద్ధ విమానాలను భారత అమ్ములపొది లో చేర్చిన భారత రక్షణశాఖ ఇక డి ఆర్ డి ఓ అభివృద్ధి చేస్తున్న ఆయుధాలకు ప్రయోగాలు నిర్వహించి అధునాతన ఆయుధాలను కూడా భారత అమ్ములపొదిలో చేరుస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఇతర దేశాల నుంచి అధునాతన ఆయుధాలను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి మరో ఆయుధాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది భారత్. ఫ్రాన్స్ హామర్ మిస్సైల్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. బంకర్లను పూర్తిగా ధ్వంసం చేసే టువంటి.. హామర్ మిస్సైల్స్ ను ఫ్రాన్స్ భారత్కు ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. వాస్తవంగా అయితే ఆర్డర్ ఇస్తే ఈ ఆయుధాలను రెండేళ్ల తర్వాత ఇస్తుంది. కానీ ఏకంగా భారత్ కి సహాయం చేసేందుకు కేవలం రెండు నెలల సమయంలోనే ఈ ఆయుధాలను ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా నావి పరంగా కూడా స్టెల్క్ సబ్ మెరైన్ ఇవ్వడానికి కూడా ఫ్రాన్స్ సిద్ధమైంది.