SBI క్రెడిట్ కార్డు బ్లాక్ చేయాలనుకుంటే...!?

N.ANJI
దేశీయ ప్రభుత్వం బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు తమ క్రెడిట్ కార్డు పోగొట్టుకున్నప్పుడు లేదా ఎవరైనా దొంగిలించినప్పుడు కార్డును బ్లాక్ చేయడమెలాగో సూచించింది. ఎస్ బీఐ హెల్ప్ లైన్ నంబరుకు లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా కార్డును సులభంగా బ్లాక్ చేసుకోవచ్చని బ్యాంక్ వెల్లడించింది.
దేశంలోనే అతిపెద్ద రుణదాతగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్ బీఐ వినియోగదారుల కోసం క్రెడిట్ కార్డులు జారీ చేస్తూ మెరుగైన సేవలు అందిస్తోంది. కస్టమర్ల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్ బీఐ కార్డు వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా కార్డును బ్లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెల్ప్ లైన్ నంబర్ 040-3902 0202 కాల్ చేసి బ్లాక్ చేసుకోవచ్చు. లేదా ఫోన్: 1860 180 1290 నంబర్ కు కాల్ చేసి క్రెడిట్ కార్డును బ్లాక్ చేసుకోవచ్చు. లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 5676791 నంబర్ కు ‘‘BLOCK XXXX’’ (క్రెడిట్ కార్డు చివరి నాలుగు సంఖ్యలు) ఎంటర్ చేసి మెసేజ్ పంపించాలి. ఇలా చేస్తే మీ క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుంది.
ఎస్ బీఐ వెబ్ సైట్ కి లాగిన్ అయి క్రెడిట్ కార్డును బ్లాక్ చేసుకోవచ్చు. ముందుగా sbicard.com అనే వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలి. దీని తర్వాత రిక్వెస్ట్ ట్యాబ్ కు వెళ్లి ‘‘రిపోర్ట్ లాస్ట్ లేదా స్టోలెన్ కార్డు’’ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత కార్డు నంబర్ ను ఎంటర్ చేయాలి. ఒక వేళ కార్డు మళ్లీ పొందాలనుకుంటే రీ ఇష్యూ కార్డు అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ ను క్లిక్ చేయాలి. మీ వివరాలు నమోదు చేసిన తర్వాత క్రెడిట్ కార్డు బ్లాక్ చేయడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: