ఇంటి దగ్గరే రేషన్ బియ్యం అందుకోవాలంటే ఇవి చేయాల్సిందే..
ఇంటికి రేషణ్ బియ్యం పంపించేందుకు 9,260 మొబైల్ వాహనాలు సిద్ధం చేశారు అధికారులు. మొబైల్ వాహనాల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 20 శాతం ఈబీసీలకు కేటాయిస్తారు. ఆరేళ్లకు వాహనం పూర్తిగా లబ్ధిదారుడికి సొంతమవుతుంది. ప్రస్తుతానికి ఈ వాహనాల్లో బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించారు. అయితే ఒకవేళ వాహనం వచ్చినప్పుడు సంబంధిత లబ్ధిదారులు ఇంటి వద్ద లేకపోతే తిరిగి అవి రేషణ్ దుకాణానికే చేరుకుంటాయి. ఒకవేళ లబ్దిదారులు వేరే ప్రాంతాల్లో ఉంటే.. అక్కడ రేషన్ దుకాణాలకు లేక వాలంటీర్లకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారికి రేషన్ బియ్యాన్ని ఇంటివద్దకు తెచ్చి ఇవ్వగలుగుతారు. అంటే జనవరి 1నుంచి రేషన్ సరకుల్ని ఇంటివద్ద తీసుకోవాలనుకుంటున్నవారిలో స్థానికులు కానివారంతా ముందస్తుగా అక్కడి వాలంటీర్లకు, రేషన్ దుకాణాలవారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయకపోతే.. వారిని లెక్కలోకి తీసుకునే అవకాశం ఉందడు. మరోవైపు బియ్యం బస్తాలు దారి మళ్లకుండా ఉండేందుకు ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్ వేయాలనుకుంటున్నారు అధికారులు. రేషన్ బియ్యం తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ అమరుస్తారు.