హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ విషయంలో తాము ఆడిన నాటకాలొద్దు. ఇక పోరాటాలు ఒక్కటే మార్గమన్నారు. ప్రజలు అనేక ఉద్యమాలు చేశారు. ఇక ప్రజాప్రతినిధులు ఉద్యమాలకు దిగాలి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ను నమ్మడం లేకనే జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేయడం లేదన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని విలన్గా చూస్తున్నారని అన్నారు. కేంద్రం ప్రకటించిన తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు దిశగా వెంటనే చర్యలు తీసుకుంటేనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారన్నారు. తెలంగాణ కోసం ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీకి చెందిన 15మంది ఎమ్మెల్యేలు పదవీ త్యాగానికి సిద్ధపడితే కాంగ్రెస్ అధిష్టానం ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం దిగి వస్తుందన్నారు. తెలంగాణ ప్రకటించకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలువడం కష్టమేననీ కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారకముందే అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: