బీజేపీ కి రాజు గారు చేస్తున్న మేలు చెప్పలేనంత ?

ఏపీలో అధికారం దక్కించుకోవాలని తహతహలాడుతున్న కేంద్ర అధికార పార్టీ బిజెపి ఏరికోరి మరీ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ను నియమించింది. వీర్రాజు ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తూ వస్తుంది. దీంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతోపాటు, అధికార పార్టీ వైసిపి పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడిపెడుతూ, వైసిపి ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ హడావుడి చేశారు. అయితే అకస్మాత్తుగా కేంద్ర బిజెపి పెద్దలు వైసిపి తో సన్నిహితంగా మెలగడం, జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తుండడం, వంటి వ్యవహారాలతో, ఏపీ బీజేపీ నేతలు అప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేసినా, ఒక్కసారిగా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. దీంతో రాజకీయంగా నూ, ఏపీ బీజేపీ నేతలు ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే వారి బాధ్యతలను తీసుకున్నట్టుగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహరిస్తున్నారు.



 వైసీపీ ప్రభుత్వం బీజేపీపై స్పందించాల్సిన విషయాలపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ, అడుగడుగున ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా, ఆయన వ్యవహరిస్తున్నారు. పాస్టర్లకు నెలకు ఐదు వేలు జీతం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తూనే, ఏపీలో క్రిస్టియన్ మతం వ్యాప్తి చెందడానికి జగన్ పరోక్షంగా సహకరిస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. అసలు ప్రజల సొమ్ముతో ఈ విధంగా జీతాలు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తూనే జగన్ అర్జెంట్ గా ఆ పదవి నుంచి దిగి పోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంపై రఘురామకృష్ణరాజు గట్టిగానే వైసీపీని తగులుకున్నాడు. టీటీడీ విషయంలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తిన ఆయన ఒక భక్తుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం  తన హక్కు అంటూ చెబుతున్నారు. ఇవే కాదు హిందూత్వం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పై బీజేపీ వదిలిపెట్టకుండా, రాజు గారు మాత్రం వదిలిపెట్టడం లేదు.



 ఈ విషయంలో బిజెపి వెనక్కి తగ్గిపోయినా, రాజుగారు మాత్రం బిజెపి పాత్రను ఆయనే తీసుకుని, హిందుత్వం అంశాలను ప్రస్తావిస్తూ, ఎంతో హడావుడి చేస్తున్నారు. దీంతో రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరకుండానే, ఆ పార్టీ అజెండాను అమలు చేస్తున్నారని, ఈ విషయం లో బిజెపి నేతలు విఫలం అయ్యారు అంటూ వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: