గుడివాడలో కొడాలి సీన్ అయిపోయిందా?

M N Amaleswara rao
గుడివాడ నియోజకవర్గం..ఒకప్పుడు టీడీపీ కంచుకోట. ఇప్పుడు కొడాలి నాని అడ్డా. నాని ఇక్కడ వరుసగా నాలుగుసార్లు గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన నాని, ఆ తర్వాత టీడీపీలో ఉన్న కుళ్ళు రాజకీయాల నుంచి బయటపడాలని చెప్పి, వైసీపీలో చేరి, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. ఇక దీని బట్టే చూసుకోవచ్చు. గుడివాడ కొడాలి నాని కంచుకోటగా మారిపోయిందని. ఓ రకంగా చెప్పాలంటే ఇది వైసీపీకి కూడా అనుకూలమైన నియోజకవర్గం కాదు. కేవలం కొడాలి నాని ప్రభావం వల్లే టీడీపీ ఓటమి పాలవుతుంది.
ఎందుకంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా నానికి ఫాలోయింగ్ ఉంది. దాని వల్లే గుడివాడలో నాని గెలుపుకు తిరుగులేకుండాపోయింది. చంద్రబాబు డైరక్ట్‌గా పోటీ చేసినా సరే గుడివాడలో టీడీపీ గెలుపు చాలా కష్టమనే చెప్పొచ్చు. అయితే ఇలా గుడివాడని తన అడ్డాగా మార్చుకున్న నానికి ఇప్పుడు ఇబ్బందులు మొదలయ్యాయని టీడీపీ కార్యకర్తలు పుకార్లు లేపారు. నాని మంత్రి అయ్యాక, అధికారం ఉందనే ధీమాతో ఉన్నారని, అందుకే పరుష పదజాలం వాడుతూ చంద్రబాబు, లోకేష్‌లని సైతం తిడుతున్నారని, అదే ఇప్పుడు నానికి మైనస్ అవుతుందని టీడీపీ శ్రేణులు హడావిడి చేస్తున్నాయి.
ఇటీవల నారా లోకేష్ పంట పొలాలు పరిశీలించడానికి వెళ్ళే సమయంలో ట్రాక్టర్ తోలుతూ గుంటలో దింపారు. దీనిపై నాని తీవ్ర వ్యాఖ్యల చేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా ఉందని, వరదలు ఎప్పుడు వచ్చాయి... ఎప్పుడు పరిశీలిస్తున్నారని, లోకేష్ ఆఫ్ నాలెడ్జ్.. పార్టీ నడపడం రాదు, ట్రాక్టర్ నడపడం రాదని సెటైర్లు వేశారు. ఇక దీనిపై టీడీపీ కార్యకర్తలు రివర్స్‌లో గుడివాడలో నాని పని అయిపోయిందన్నట్లుగా మాట్లాడుతున్నారు.
అయితే గుడివాడలో నానీని దెబ్బకొట్టడం అంత సులువు కాదని వైసీపీ శ్రేణులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నాయి. అయినా గుడివాడలో నానికి చెక్ పెట్టడం చాలా కష్టం. ఆయన అలా దూకుడుగా మాట్లాడటమే బాగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి గుడివాడలో టీడీపీ సీన్ అయిపోయిందని అనొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: