సరిహద్దుల్లో చైనా ఊహలు.. జరిగిన వాస్తవాలు.. వణికిపోతున్న చైనా..?
మొదట నిషేధిత ప్రాంతం లోకి వచ్చి భారత్ ను బెదిరిస్తే వెనక్కి తగ్గుతుందని చైనా ఊహించింది.. భారత్ మాత్రం చైనా ఊహకందని విధంగా దీటుగా నిలబడింది. చైనా ఆయుధాలను చూసి ఆర్మీ ని చూసి భారత్ వెనక్కి తగ్గుతుంది అని నమ్మింది చైనా. కానీ సరిహద్దుల్లో అది కూడా జరగలేదు. భారతసైన్యం ఎంతో దీటుగా బుద్ధి చెప్పింది. ఎక్కువ రోజులపాటు సరిహద్దుల్లో కాలయాపన చేస్తూ వేచి చూస్తూ ఉంటే సైనిక ఖర్చులు తట్టుకోలేక భారత్ వెనక్కి తగ్గుతుందని చైనా వ్యూహం పన్నింది కానీ అది కూడా సరిహద్దుల్లో ఫలించలేదు.
ఆతర్వాత పర్వత ప్రాంతాలలో చలి తీవ్రత మరింత ఎక్కువై భారత సైనికులు అందరూ వెనక్కి పారిపోతారు అని చైనా ఊహించింది.. చలి ప్రాంతంలో భారత సైనికులు వెనక్కి తగ్గలేదు కదా మరింత దీటుగా నిలబడడంతో చైనా కు షాక్ తగిలింది. ఇక రాజీ ప్రయత్నాలు చేస్తే వెనక్కి తగ్గుతుందని ఉద్దేశంతో ఏకంగా రష్యాతో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ అదికూడా సాధ్యం కాలేదు. శాంతి వచనాలు వల్లిస్తే అది నమ్మి భారత్ వెనక్కి వెళ్తుందని చైనా అనుకుంది కానీ ఎక్కడ కూడా భారత్ వెనుకడుగు వేయలేదు. ఇలా భారత్ విషయంలో చైనా ఊహలు ఒకలాగా ఉంటే భారత్ బదులిచ్చిన వాస్తవాలు వేరే లాగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.