సమస్యలపై సీఎం సమీక్ష

 హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రజాసమస్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ఎరువులు, విత్తనాల కొరత, కరంటు సమస్యలపై సమీక్షించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు బ్లాకులో అమ్మితే కఠినంగా వ్యవహారించాలన్నారు. ఎక్కడయితే కరంటుపై రైతులు ఎక్కువగా ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారో అక్కడ అవసరమైతే అధికారులు సబ్ స్టేషన్ల వారీగా సమీక్షలను నిర్వహించాలను. కరంటు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సమస్యలతో పాటు 108, 104 వాహనాల సర్వీసు రెగ్యులర్గా ఉండే విధంగా అధికాలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు ఉదాసీనతగా వ్యవహారిస్తే కఠినంగా వ్యవహారించాల్సి వస్తుందనీ సీఎం కిరణ్ కాస్త ఘాటుగానే హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: