రైతులకు మరో శుభవార్త చెప్పిన జగన్..!!

Satvika
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అర్థమవుతుంది.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలకు మంచి రోజులు వచ్చాయని తెలుస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు ఇప్పటికీ చేస్తున్నారు. ఇకపోతే రైతులకు వరాల జల్లు కురిపిస్తున్నారు. రైతుల వల్ల రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రుణాలను మంజూరు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

కరోనా వైరస్, వరదల ముప్పు పొంచి ఉన్న తరుణంలో రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ నెల 27వ తేదీన రైతు భరోసా డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు‌ ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, పంటలు, కోవిడ్‌, వార్డు సచివాలయాల తనిఖీలు, నాడు- నేడు తదితర అంశాలపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు జిల్లా కలెక్టర్లతో, ఎస్పీలతో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ మేరకు జగన్ మాట్లాడుతూ.. రైతు భరోసా ను రెండో విడుతను అందించాలని అధికారులకు సూచించారు.ఖరీఫ్‌ పంటలకు సంబంధించి రూ. 113 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి మరో రూ. 32 కోట్లు ఇస్తామన్నారు. మొత్తం రూ. 145 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు అందజేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ నెలలో పూర్తి సమాచారాన్ని అందించి, వచ్చే నెల నవంబర్  15 వ తేదీ కల్లా నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అటవీ భూముల పట్టాలు ఇచ్చిన గిరిజనులకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఈ నెల 27న రూ.11,500 చొప్పున ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం పై ఆంధ్ర ప్రదేశ్ అంతటా సంతోషం వెదజల్లుతుంది..రైతులు జగన్ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.. తండ్రికి తగ్గ తనయుడు అయ్యారని పొగడ్తలతో ముంచెత్తారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: