మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. 50 శాతం తగ్గింపు..?

praveen
దసరా పండుగ వచ్చిందంటే చాలు ప్రజలందరికీ ఎన్నో రకాల ఆఫర్లు అందుబాటులో ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అన్ని రకాల సంస్థలు అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తూ ఎంతోమందిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఈ పండుగ సీజన్లో వివిధ సంస్థలు ప్రకటిస్తున్న ఆఫర్లతో ప్రజలందరికీ నిజమైన పండుగ అని చెప్పాలి. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రయాణికులు అందరికీ శుభవార్త తెలిపింది. ఈనెల 17 నుంచి 31 వరకు స్మార్ట్ కార్డ్, పేపర్,  డిజిటల్ క్యూఆర్ టికెట్లపై ఏకంగా 50 శాతం తగ్గింపు ఇచ్చేందుకు నిర్ణయించింది హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్.


 ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల వల్ల నగరం లో మొత్తం రోడ్డు దెబ్బతిన్న నేపథ్యంలో ఎక్కువమంది మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల రద్దీ కూడా భారీగా పెరిగిపోయింది. ఇక ఈ పండుగ సీజన్లో మెట్రో ప్రయాణాన్ని ప్రజలందరికీ మరింత ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకొని అందరికీ ఇలాంటి తరహా రాయితీలను ప్రకటిస్తున్నట్లు మెట్రో యం.డి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. ఇది మెట్రో ప్రయాణికులు అందరికీ పండగ ట్రీట్ లాంటిది అనే చెప్పాలి.

 ఇక స్మార్ట్ కార్డు దారులకు అదనపు ట్రిప్పుల ఆఫర్ ను కూడా ప్రకటించింది హైదరాబాద్ మెట్రో లిమిటెడ్. లాక్ డౌన్ కారణం గా నిలిచిపోయిన మెట్రో రైలు సర్వీసులు గత నెల 7 నుంచి మళ్లీ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం అయినప్పటికీ మునుపటిలా మాత్రం ప్రయాణికుల రద్దీ లేదు. కరోనా  వైరస్ కు ముందు ఏకంగా మెట్రో లో  నాలుగు లక్షల మంది ప్రయాణించే వారు ఇప్పుడు ఆ సంఖ్య కేవలం లక్ష లోపల ఉండటం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈ పండుగ సీజన్లో మెట్రో రైల్ లిమిటెడ్ ప్రకటించిన బంపర్ ఆఫర్లతో  కష్టమర్లందరికీ మెట్రో ప్రయాణం వైపు ఆకర్షించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: