ఫ్లాష్ బ్యాక్ : హైకోర్టు చీఫ్ జస్టిస్ ను మార్చమంటూ కేంద్ర హోంశాఖకు సీఎం ఫిర్యాదు..!?
అయితే ఇదంతా పాఠకులకు అలవాటైన వ్యవహారమే. అయితే.. ఇలాంటి సమయంలో కొందరు ఆసక్తి ఉన్న జర్నలిస్టులు.. కాస్త ఫ్లాష్ బ్యాక్ తవ్వితీసి అసలు వాస్తవాలు జనం ముందు ఉంచుతున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా పోస్టు బాగా వైరల్ అవుతోంది. ఇలా న్యాయమూర్తుల మీద ఫిర్యాదు చేసిన సీఎంలలో జగనే మొదటి వాడు కాదట. గతంలో 1960లో ముఖ్యమంత్రిగా ఉన్న దామోదరం సంజీవయ్య అప్పట్లో కొందరు జడ్జిలపై కేంద్రానికి ఫిర్యాదు చేశారట. అవినీతి పరులు అయిన న్యాయమూర్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారట.
సదరు న్యాయమూర్తులు అవినీతిపరుల కోసం పని చేస్తున్నారు అని... ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను మార్చాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి సంజీవయ్య కేంద్ర హోమ్ శాఖ కి ఉత్తరం రాశారట. అంతే కాదు.. ఆనాటి హోమ్ మంత్రి శాస్త్రి గారితో స్వయంగా చర్చించా అని కూడా అదే ఉత్తరం లో రాశారట. ఇందుకు సంబంధించిన లెటర్ కాపీ కూడా జత చేస్తూ కొందరు పోస్టులు పెడుతున్నారు. కొన్ని వాస్తవాలు ఇలా ఉంటే.. అసలు న్యాయ వ్యవస్థపై ఫిర్యాదు చేయడమే మహా ద్రోహం పాపం.. అన్నట్టు కొన్ని పత్రికలు ప్రచారం మొదలుపెట్టాయి.