మాజీ స్టూడెంట్ తో లెక్చరర్ అఫైర్.. కానీ చివరికి..?

praveen
అక్రమ సంబంధాలు నెపంతో జరుగుతున్న దారుణ ఘటనలు రోజురోజుకు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. మానవీయ విలువలను మరిచి క్షణకాల సుఖం కోసం అక్రమ సంబంధాలకు తెరలేపుతున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వచ్చి సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పిన గురువు తోనే ప్రేమ పేరుతో రాసలీలలు మొదలు పెట్టింది ఇక్కడ ఒక యువతి. ఏకంగా గురువు కి పెళ్లి అయింది అన్న విషయం తెలిసి కూడా వివాహేతర సంబంధానికి తెరలేపింది. అంతటితో ఆగకుండా అతని భార్య కి ఫోన్ చేసి తమ  సుఖానికి  అడ్డు గా ఉన్నావు అంటూ వేధింపులకు గురిచేయడం మరింత సంచలనం గా మారిపోయింది.




 చివరికి గురువుని రెండో పెళ్లి చేసుకొని ఆ ఫోటోలు మొదటి భార్యకు పంపడంతో మనస్థాపం చెందిన మొదటి భార్య ఆత్మహత్య చేసుకొని మరణించిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాల లో వెలుగులోకి వచ్చింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఆళ్లగడ్డ మండలం ముత్త లూరు కు చెందిన పుల్లయ్యకు  వెల్దుర్తి మండలం రామళ్లకోట కు చెందిన కీర్తితో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పుల్లయ్య ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్నాడు.



 కీర్తి కూడా ఓ పాఠశాలలో టీచర్ వృత్తిలోనే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పుల్లయ్యకు మాజీ విద్యార్ధి తో ఏర్పడిన పరిచయం కాస్తా కాపురంలో చిచ్చు పెట్టింది. గతంలో పుల్లయ్య పనిచేసిన కళాశాలలోనే చదువుకున్న సుభాషిని అనే యువతి పుల్లయ్య తో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధానికి తెరలేపింది. ఇక ఈ క్రమంలోనే ఎన్నో రోజుల పాటు రాసలీలలు కొనసాగించిన సుభాషిని... పుల్లయ్య భార్యను వేధింపులకు గురి  చేయడం మొదలు పెట్టింది. నాలుగు నెలల కిందట రెండో పెళ్లి చేసుకుని ఆ ఫోటోలని మొదటి భార్యకు పంపడంతో మనస్తాపం చెందిన మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు నిజాలు బయట పడడంతో బంధువులందరూ పుల్లయ్యను  చితకబాదారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: