జగన్ లేఖ రాశారు సరే.. మరి ఇప్పుడు సీజేఐ ముందున్న ఆప్షన్లు ఏంటి..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ దేశ అత్యున్నత న్యాయస్థానంలోని ఓ న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేశారు. ఆయన తెలుగు దేశం అధినేత చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మరి ఇప్పుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే ఏం చేస్తారు.. ఆయన ముందున్న అంశాలు ఏంటి.. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. ఆయన రెండు రకాలుగా స్పందించే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై ఫిర్యాదులు వస్తే తగిన చర్యలు తీసుకునే అధికారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉంటుంది. అయితే బాబ్డో ఎలా స్పందించొచ్చు అనే అంశంపై ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ విశ్లేషణ ప్రచురించింది. ఈ విశ్లేషణ ప్రకారం సీజేఐ బోబ్డే ముందు రెండు ఆప్షన్ లు ఉన్నాయి. ఒక ఆప్షన్ మొత్తం సుప్రీం కోర్టు జడ్జిలందరితో సమావేశమై ఈ లేఖపై కూలంకషంగా చర్చించడం. ఈ లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? విచారణకు అంగీకరించాలా? లేదా అన్నదానిపై సీజేఐ మిగిలిన న్యాయమూర్తులతో చర్చించే అవకాశం ఉంది. ఆ మీటింగ్‌లో మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయాలను పరిశీలించి సీజేఐ అంతిమంగా ఓ నిర్ణయం తీసుకోవచ్చు.

మరో ఆప్షన్ ప్రకారం.. ఛీప్ జస్టిస్.. ఈ అంశంపై జడ్జిలతో ఒక కమిటీని నియమించి జగన్ సర్కారు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి.. ఆధారాలపై పూర్తిగా అధ్యయనం చేసి ఓ నివేదిక ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఈ రెండూ చేయకుండా ఎక్కువ కాలం జాప్యం చేసే అవకాశం సీజేఐ వద్ద ఉండకపోవచ్చు.

ఎందుకంటే ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జగన్ వ్యక్తిగత హోదాలో కాకుండా ముఖ్యమంత్రి హోదాలో లేఖ రాశారు. ఏపీ సర్కారు లేఖ రాసిట్టు. కాబట్టి దీన్ని విస్మరించే అవకాశం లేదు. ఒకవేళ విస్మరిస్తే.. జగన్ సర్కారు రాష్ట్రపతిని, ప్రధానిని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అందులోనూ ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు జడ్జి రమణపై చేసిన ఆరోపణలు కూడా చాలా తీవ్రమైనవి. కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోకతప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: