అదో వింతలోకం.. ఎక్కడుందో తెలుసా..?
26 ఏళ్ల క్రితం వచ్చిన భైరవద్వీపం జానపద చిత్రం .. తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూపింది. ఇందులో హీరో బాలకృష్ణ ఓ హారం కోసం వెళ్తూ.. మరుగుజ్జు మనుషులతో కలిసి కొన్నిరోజులు ఉండాల్సి వస్తుంది. వారి భాష, నివాసం, అంతా చిత్ర విచిత్రంగా ఉంటూ ప్రేక్షకులను కట్టి పడేసింది.
చైనాలోని డ్వార్ప్ మ్యూజియంలో ఇక్కడ ఉండేవారందరూ చిట్టిచిట్టి మనుషులు. పుట్టగొడుగులను తలపించే విచిత్రమైన గృహాలు. వీరి ఆటలు, పాటలు.. ఓహో ఒకటేమిటి అంతా వినోదమే. ప్రధానంగా వీరు మధ్యయుగానికి చెందిన రాజులు, సైనికులు, వంటవాళ్లు.. ఇలా వివిధ గెటప్పుల్లో కనువిందు చేస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా వివిధ ప్రదర్శనలు ఇస్తుంటారు. దీంతో ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరిగింది.
ఇలాంటి వారందరితో చైనా.. ఓ థీమ్ పార్క్ ఏర్పాటు చేసింది. ఇందులో 4 వందలకు పైగా సిబ్బంది ఉన్నారు. వీరందరి ఎత్తూ రెండు నుంచి నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. వివిధ విన్యాసాలు చేస్తూ , ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. రోడ్లపై అర్థాకలి బతుకులు బతికే తమకు... ఇవి గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అవకాశం కల్పిస్తున్నాయని ఈ మరుగుజ్జులు చెబుతున్నారు.
అయితే మనుషులను ఇలా ప్రదర్శనకు పెట్టడం అమానవీయం అని కొందరు విమర్శిస్తుంటే... మరికొందరు మాత్రం ఉపాధి కల్పించడం అభినందనీయమంటున్నారు. మొత్తానికి చైనాలో మరగుజ్జుల థీమ్ పార్క్ తెగ ఆకట్టుకుంటోంది. సందర్శకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ పార్క్.. దాదాపు 400మందికి ఉపాధి కల్పిస్తోంది. మనుషులను ప్రదర్శనకు పెట్టడం ఏంటని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే.. ఉపాధి కల్పించడంపై ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్నారు.