గ్రేటర్ లో గెలుపుకోసం టీఆరెస్ కొత్త ఎత్తుగడ..?
ఇక స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రతీ సారి చట్టాలు మార్చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో పంచాయతీ ఎన్నికలప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చారు. మున్సిపల్ ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు మున్సిపల్ చట్టాన్ని మార్చారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల కోసమూ చట్టాల్ని మార్చాలనుకుంటున్నారు. ఇందుకోస ప్రత్యేకంగా అసెంబ్లీని కూడా సమావేశపర్చాలని అనుకుంటున్నారు. అక్టోబర్ 13న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను, 14న కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నారు.
డిసెంబర్ లోగా ఈ ఎన్నికలు పూర్తి చేయాలనీ కేసీఆర్ భావిస్తుండగా దీని కావాల్సిన కసరత్తు ఇప్పటికే పూర్తయ్యింది.. ఈ ఎన్నికల్లో మొదటినుంచి కేసీఆర్ తలచినట్లు బ్యాలెట్ పద్ధతినే ఉపయోగించనున్నారు.. అయితే ఎప్పుడు ఈవీఎం లు ఉపయోగించే ఎలక్షన్స్ కమిషన్ ఇప్పుడు ఈ పద్ధతి ని ఉపయోగించి ఎలక్షన్స్ నిర్వహించడానికి కారణం అందరు కరోనా అనుకున్నారు కానీ అది కాదని తెలుస్తుంది.. ఈవీఎం లు కాకుండా బ్యాలెట్ పద్ధతిని ఉపయోగించడానికి అసలు కారణం ఈవీఎంలు…వీవీప్యాట్ లు అందుబాటులో లేకపోవడమే అంటున్నారు.. బీజేపీ పార్టీ తప్పా అన్ని పార్టీ ఈవీఎం ను వద్దని కోరగా కేసీఆర్ గట్టి పట్టు తోనే బ్యాలెట్ పద్ధతిని వాడబోతున్నట్లు తెలుస్తుంది..