బాబోయ్.. ఇలా చేయడానికి జగన్‌కు ఎన్ని గుండెలు..?

Chakravarthi Kalyan
జగన్ అంటే జగమొండి.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. కానీ మరీ ఇంత జగమొండి అని అనుకోలేదని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. తాను నమ్మిన దాని కోసం ఎందాకైనా పోరాడే తత్వం జగన్ కు ముందు నుంచీ ఉన్నదే.. కొత్తదేమీ కాదు.. కానీ ఏం జరిగినా పర్వాలేదనే మొండి ధైర్యం తనదని జగన్ మరోసారి నిరూపించాడు. ఏకంగా తన ప్రభుత్వంపై ఏపీ హైకోర్టులో ఏం జరుగుతుందో.. దాని వెనుక ఎవరున్నారో.. సవివరంగా ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికే లేఖ రాసేశాడు.

జగన్ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అది ఓకే.. కానీ ఆయన ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఓ నిందితుడు. అందుకే.. కోర్టులు, న్యాయమూర్తులంటే కాస్త భయపడతాడని ఎవరైనా అనుకుంటారు. కానీ.. జగన్ మాత్రం సవాలే లేదని మరోసారి నిరూపించాడు. తన ప్రభుత్వాన్ని పని చేసుకోనివ్వకుండా ఏపీ హైకోర్టులో ఏ న్యాయమూర్తి ఎలాంటి పనులు చేస్తున్నారు.. వాళ్లను వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారో.. దీని మొత్తం వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో .. మొత్తం డిటైల్డ్‌ గా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసేశాడు.


అంతే కాదు.. ఆ విషయాన్ని తన ప్రభుత్వ ప్రతినిధులతో ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రపంచానికి వెల్లడి చేశాడు. జగన్ చేసిన సాహసం సాధారణమైంది కాదు.. దీని పరిణామాలు ఎలాగైనా ఉండొచ్చు.. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది..? జగన్ సర్కారు తెలుగుదేశంతో న్యాయమూర్తులకు ఉన్న లింకులు కూడా తన లేఖలో చెప్పేశాడు. ఇప్పుడు దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగడం ఖాయం.. జాతీయ మీడియా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది.


జగన్ రాసిన లేఖతో ఇప్పుడు దేశం చూపు ఏపీవైపు తిరిగింది. మరి జగన్ చేసింది కరెక్టేనా..? ఒక పార్టీ, ఒక మీడియా కూటమి, జుడిషియరీ, బ్యూరోక్రాట్లు.. అందరితోనూ ఒకేసారి తలపడి నెగ్గుతాడా..? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది.. ఈ పరిణామాల్లో పైచేయి ఎవరిది అవుతుంది..? కాలమే సమాధానం చెప్పాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: